top of page
ఆంజనేయుడు.jpg

హనుమంతుని వాహనం ఒంటె

రామభక్త హనుమంతుడిని...

హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు హిందువులు ఎలా ఉండాలో ధర్మాన్ని ఎలా రక్షించాలి అని హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు

ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి,

మారుతి, అంజనిసుతుడు వంటి పేర్లతో... ఆంజనేయస్వామిని ఆరాధిస్తారు

దేశంలో హనుమంతుడి గుడి, లేదా...

విగ్రహం లేని ఊరు బహుఅరుదని చెప్పవచ్చు#

అయితే శ్రీరామ బంటు హనుమంతుడి

జీవితం గురించి మన పురాణాల్లో అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కోకొల్లలుగా అనేక గాథలున్నాయి*

కొన్ని యోజనాల దూరాన్ని ఒక్క అంగలో అధిగమించే రుద్రాంశ సంభూతుడు.. వాయు పుత్రుడు వాహనం ఒంటె. ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటి విగ్రహం ఉంటుంది*

వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి

ఒంటె వాహనం అవ్వడం వెనుక ఆసక్తికరమైన

కథ ఒకటి పురాణాల్లో ఉంది*

రావణుని బావమరిది దుందుభిని

వాలి భీకరంగా పోరాడి వదిస్తాడు*

అతడి మృతదేహాన్ని ఋష్యమూక పర్వతం..

(నేటి హింపీ ప్రాంతం) పై పడేశాడు. ఈ సంఘటనే వాలి శాపాన్ని పొందేందుకు కారణంగా మారింది*

ఋష్యమూక పర్వతం పైన

మాతంగ మహాముని తపస్సు చేసుకుంటున్నాడు* తాను తపస్సు చేసుకుంటున్న పర్వతంపై

వాలి దుందుభి మృతదేశాన్ని పడవేయడం

మాతంగ మహర్షి చూశాడు.

దీంతో మాతంగ మహర్షి కోపంతో వాలి కనుక రుష్యమూక పర్వతం మీద కాలు పెడితే

మరణిస్తాడని శపించాడు. కాలక్రమంలో సుగ్రీవుణ్ణిని వాలి చంపడానికి వెంటాడిన సమయంలో..

తన అన్న ఋష్యమూక పర్వతం మీద

కాలు పెట్టడని శాపోదంతం తెలుసున్న సుగ్రీవుడు పర్వతానికి వెళ్లి దాక్కున్నాడు. ఆ సమయంలో తన స్నేహితుడైన సుగ్రీవుణ్ణి చూడటానికి హనుమంతుడు ఋష్యమూక పర్వతం మీదకు చేరుకున్నాడు*

అప్పుడు అక్కడే ఉన్న పంప సరోవరాన్ని తిలకించాలని హనుమంతుడు అనుకుంటాడు*

దీంతో మిత్రుడైన హనుమంతుడు పంపా సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా సుగ్రీవుడు ఒంటెను సిద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు ఒంటెను అధిరోహించి. విహరించినట్లు. అప్పటి నుంచి హనుమంతుడికి ఒంటె వాహనంగా మారినట్లు కథ..

మరొక కథ ప్రకారం...

ఆంజనేయుడి వాహనం ఒంటె

అని పరాశర సంహితలో పేర్కొన్నారు.

మనోవేగంతో సమానంగా ప్రయాణించే

వాయుపుత్రుడి వాహనాన్ని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా ప్రస్తావించలేదు.

సీతాదేవిని వెతుకుతూ పంపా నదీ తీరానికి రామలక్ష్మణులు చేరుకున్నపుడు, సుగ్రీవుడు వాళ్లను చూసి భయపడతాడు. ధనుర్బాణాలు ధరించి వస్తున్న ఈ వీరులు ఎవరో తెలుసుకొని రమ్మని హనుమను పంపిస్తాడు.

ఆంజనేయుడు మొదటిసారి శ్రీరాముణ్ని కలుసుకున్నది పంపానదీ తీరంలోనే!

ఈ ప్రాంతం హనుమకు ఎంతో నచ్చిన ప్రదేశం. ‘పంపాతీర నివాసాయ గంధమాదన వాసినే’ అని స్వామిని కీర్తిస్తారు భక్తులు.

అయితే, ఈ నది తీరం వెంబడి ఎడారిని

తలపించేలా దట్టమైన ఇసుక మేటలు ఉండేవి. హనుమ ఈ ప్రాంతంలో విహరించడానికి

సౌకర్యంగా ఉండటం కోసం..

ఇసుకలో తేలికగా నడవగలిగే ఒంటెను సుగ్రీవుడు వాయుపుత్రుడికి బహుమానంగా ఇచ్చాడని ప్రతీతి.

అంతేకాదు, హనుమంతుడి ధ్వజంపైన

కూడా ఒంటె గుర్తే ఉంటుంది.

రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు

వృషభం వంటి బలిష్ఠమైన ఒంటెను వాహనంగా ఎంచుకున్నాడని కూడా పెద్దలు చెబుతారు...

శ్రీరామదూతం శిరసా నమామిః

లోకం ఒక కుక్కతోక!

అతడొక బీదవాడు. బీదరికం నుంచి విముక్తి పొందాలన్నది అతడి తీవ్రమైన కోరిక. ఒక భూతాన్ని వశపరచుకొంటే దాని ద్వారా కోరినదంతా తెచ్చుకోవచ్చుననుకొన్నాడు. సమీపంలోని అడవిలో ఆ వశీకరణ మంత్రాన్ని అనుగ్రహించే మహాత్ముడున్నాడని తెలుసుకొని వెళ్లి, అతడి కాళ్లమీద పడ్డాడు. భూతాన్ని వశం చేసుకునే మంత్రాన్ని ఉపదేశించమని బతిమాలాడు. మహాత్ముడు ఆలోచించి 'నీకెందుకయ్యా భూతం? దానితో వ్యవహారం చాలా కష్టం. నీవిప్పుడు సుఖంగా ఉన్నావు. పేదరికంలో మనశ్శాంతి ఉంటుంది. సంపద పెరిగితే తాపత్రయాలు పుట్టుకొస్తాయి. నీవు కష్టాలపాలవుతావు. నెమ్మదిగా ఇంటికెళ్లు' అన్నాడు.

బీదవాడు వినలేదు. అతడి దైన్యాన్ని గమనించి మహాత్ముడు 'నేను చెప్పిన మంత్రాన్ని ప్రతిదినం ఉదయం జపించు. భూతం నీ వశమవుతుంది. నీవు చెప్పిన పనులన్నీ చేస్తుంది. కానీ జాగ్రత్త... భూతం చాలా భయంకరమైనది. దానికి సదా పని కల్పిస్తుండాలి. తగినంత పని కల్పించకపోతే అది నీ ప్రాణాలు తీస్తుంది' అన్నాడు. బీదవాడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

'స్వామీ, తమ సూచన మేరకు కావలసినంత పని కల్పిస్తాను' అంటూ కొన్ని రోజులు శ్రద్ధగా మంత్రాన్ని జపించాడు. వారం రోజుల తరవాత పెద్ద భూతం ప్రత్యక్షమైంది.

'ఇదో వచ్చాను. నీ మంత్రంతో నన్ను వశపరచుకొన్నావు. ఇకమీద, నాకు ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించి తీరాలి. పని చెప్పకపోయావో నిన్ను చంపేస్తాను' అన్నది.

'అయితే నాకో రాజ భవనం కట్టించు' అన్నాడు. తన మనసులో భూతానికి పెద్దపనే కల్పించాననుకొన్నాడా బీదవాడు. రాజభవనం నిర్మించడానికి చాలాకాలం పడుతుందిలే అనుకొన్నాడు. చూస్తుండగానే రాజభవనం, ఉద్యానవనం అన్నీ తయారయ్యాయి. 'మరేం చేయాలో చెప్పు' అన్నది భూతం.

'సమీపంలోని అడవిని కూల్చి ఒక మహా నగరాన్ని నిర్మించు' అన్నాడు బీదవాడికేమీ తోచక. నగర నిర్మాణం కొన్నేళ్లు పడుతుందనుకొన్నాడు. భూతం కొన్ని నిమిషాల్లోనే అద్భుతమైన నగరాన్ని సృష్టించింది.

బీదవాడు వణికిపోయాడు. మరేం పని చెప్పాలో పాలు పోలేదు. దిక్కుతోచక నేరుగా మహాత్ముడి వద్దకు వెళ్లాడు. 'స్వామీ, నన్ను కాపాడండి' అంటూ ఏడ్వసాగాడు. 'ఎంత కష్టమైన పని చెప్పినా క్షణాల్లో పూర్తిచేస్తుంది. పని చెప్పమంటుంది. నేను ఏమీ చెప్పలేకున్నాను. స్వామీ నన్ను కాపాడండి' అని పాదాలపై పడ్డాడు. ఆయన- 'అయితే, ఆ కుక్కను పట్టుకో. దాన్ని తీసుకెళ్లి దాని తోకను నిటారుగా ఉంచమని చెప్పు' అన్నాడు మహాత్ముడు.

బీదవాడు ధైర్యంగా ఆ కుక్కను పట్టుకెళ్లి భూతం చేతికిచ్చాడు. 'వెంటనే ఈ కుక్క తోకను నిటారుగా చెయ్యి' అన్నాడు. భూతం 'ఇదేం పెద్దపని!' అంటూ కుక్క తోకను తన రెండు చేతులతో నిలబెట్టి చేతులు తీయగానే వంకర! భూతం ఎన్నిసార్లు యత్నించినా ఏం లాభం, మళ్ళీ వంకరే! వారం రోజులు చేసినా సాధ్యం కాలేదు. బీదవాడి దగ్గరకు వెళ్లి, 'ఈ కుక్క తోకను నిటారుగా పెట్టించే పని మాన్పించు, నేను నిర్మించిన వాటినన్నింటినీ నీకే అప్పగిస్తాను. నిన్ను చంపనని ప్రమాణం చేస్తాను' అన్నదా భూతం.

బీదవాడు సమ్మతించాడు. బతికాను అంటూ భూతం కాళ్లకు బుద్ధి చెప్పింది. బీదవాడు మహాత్ముడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తన రాజమందిరం చేరాడు.

ఈ కథను స్వామి వివేకానందులు తమ కర్మయోగంలో చెప్పారు. ఈ ప్రపంచాన్ని దిద్దడానికి మనం యత్నించరాదు. మనకొక ప్రయోజనం ఉంది. ముందు మనసును స్థిరంగా ఉంచుకోవాలి. దాని వంకర పోతుంది. స్థిరమైన మనసుతో మంచి పనులు చేపట్టాలి. అప్పుడే మనసుకు శాంతి లభిస్తుంది. లోకం సుఖంగా ఉండగలదు. 'మనసు మర్మమెరిగినవాడె ఘనుడు' అన్నారు త్యాగరాజస్వామి

వివేకానంద.jfif
గురువు.jpg

*7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు."*

*1వ ప్రశ్న:* ప్రపంచంలో ఏది పదునైనది?

*జ:* చాలా మంది కత్తి అని చెప్పారు.

*గురువు:* కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.

*2వ ప్రశ్న:* మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?

*జ:* చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ

*గురువు:* మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం.

ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,

ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.

*3వ ప్రశ్న:* ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది?

*జ:* చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు.

*గురువు:* ప్రపంచంలో పెద్దది మన పాపమే.

*4వ ప్రశ్న:* ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?

*జ:* చాలామంది,వజ్రము ఇనుము,ఏనుగు అని చెప్పారు.

*గురువు:* కఠినమైనది అనేది *"మాట ఇవ్వడం"*

మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.

*5వ ప్రశ్న:* ప్రపంచంలో తేలికైనది ఏది?

*జ:* దూది,గాలి,ఆకులు అని చెప్పారు

*గురువు:* ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.

*6వ ప్రశ్న:* మనకు దగ్గరగా వున్నది ఏది?

*జ:* తల్లి తండ్రులు, స్నేహితులు,బంధువులు అని చెప్పారు.

*గురువు:* మనకు దగ్గరగా ఉండేది మన చావు.

అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం.

అది పుట్టుకతోనే మనవెంట వచ్చింది.

*7వ ప్రశ్న:* ప్రపంచంలో సులువైనది ఏది ?

*జ:*తినడం ,పడుకోవడం, తాగడం,తిరగడం

*గురువు:* ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు.

bottom of page