top of page

Honarary President:

Sri CY.Somayajulu

President:

Sri Ch.Reddappa Dhaveji

Vice President:

Sri.P.Subrahmanyam

Secretary:

Sir Kasturi Srinivas

Joint Secretaries:

Sri G S Subrahmanyam

Sri M Phani Sarma

Treasurers:

Sri K.S.Udaya Bhaskar

Sri G.L..N.Giridhar

Executive Members:

Dr.P S N Murthy

Smt T.Krishnaveni

Smt A.Parimala

Sri G.Satya Kishore

Sri J S Bhaskara Sarma

Sri V N S N Acharyulu

Sri P Anil Kumar Acharyulu

Sri Ch Rama Krishna

Sri S V Subrahmanyam

Sri P Viswanadha Sastry

Sri D Rama Krishna

I'm a paragraph. Click here to add your own text and edit me. It's easy.

బ్రహ్మ.jpg

బ్రహ్మరాత ఎలా ఉంటె అలా...

సర్వసాధారణంగా సమాజంలోని పెద్దలు "బ్రహ్మ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది", "ఆయన ఇచ్చిన ఆయుష్హు ఉన్నంత వరకు బతుకుతూనే ఉంటాం" అని అంటూ ఉండడం కనిపిస్తుంది. అలాంటి మాటలకు ఓ ఉదాహరణగా రావణాసురుడి కథే కనిపిస్తుంది.

రావణాసురుడు బ్రహ్మ దగ్గరి నుంచి వరాలు పొందిన తర్వాత దేవతలు, ఋషులు సహా సర్వలోకాల్ని బాదించసాగాడు. రాక్షసానందంతో ఆ అసురుడు పుష్పక విమానమెక్కి లోకాలన్నింటి మీదకు దండెత్తుతున్న సమయంలో ఒకనాడు ఆకాశమార్గాన నారదముని ఎదురయ్యాడు. నారదుడికి నమస్కరించి రావణుడు కుశల ప్రశ్నలు అడిగాడు. నారదుడు ఎంతో సంతోషించి రావణుడి ప్రయాణ కారణమేమిటని అడిగి తెలుసుకున్నాడు. దేవతలందరినీ జయించడమే తన ప్రయాణపు లక్ష్యమని రావణుడు చెప్పాడు. అప్పుడు నారదుడు అంతగా కష్టపడి అందరి మరణానికి కారకుడైన యమధర్మరాజును జయించినందువల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని, ఆ ప్రయత్నం చేసి చూడాలని చెప్పాడు. యమపురికి వెళ్ళే మార్గం చాల కష్టతరమైందని నారదుడు రావణుడిని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక ఆ రాక్షసుడికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్లైంది. రావణుడు వెంటనే యమపురికి బయలుదేరాడు.

ఇంతలో నారదుడు వెళ్లి యమధర్మరాజుకు రావణాసురుడు యుద్ధానికి వస్తున్నట్లు చెప్పాడు. నారదుడు అలా చెప్పుతున్నంతలోనే గొప్ప కాంతులతో విరాజిల్లుతున్న పుష్పక విమానమెక్కి రావణాసురుడు యమలోకంలో ప్రవేశించాడు. ఎన్నో పాపాలు చేసి వాటికి తగిన ఫలితాన్ని అనుభవిస్తున్న ఎందరెందరినో రావణాసురుడు అక్కడ చూసాడు. భయంకరమైన రూపాలు కలిగిన యమకింకరులు అక్కడ ఉన్నారు. ఆ కింకరులు పెట్టె బాధలకు తట్టుకోలేక పాపం చేసిన వారంతా ఏడుస్తూ ఉండడం కనిపించింది. కొంత మంది పురుగులకు, మరికొంతమంది కుక్కలకు ఆహారంగా అయిపోయి భయంకరంగా కేకలు పెట్టడం కనిపించింది. మరికొంతమంది రక్త ప్రవాహంతో ఉన్న వైతరణి నదిని దాటి కాలుతున్న ఇసుకలో దొర్లాడుతూ పెడబొబ్బలు పెడుతూ యాతనలు పడుతున్నారు. మరికొంతమంది పుణ్యాత్ములను ఆ పక్కనే ఉన్న ప్రదేశంలో రావణుడు చూసాడు. సంగీత వాయిద్యాలను వింటూ కొంత మంది సంతోషిస్తున్నారు. గోదానం చేసిన వారు పాలను, అన్నదానం చేసిన వారు గృహవాస సుఖాన్ని అనుభవిస్తూ కనిపించారు. యమభటుల చేతిలో బాధలు అనుభవిస్తున్న పాపాత్ములు కొంత మందిని బాధ అనుభవించకుండా రావణుడు పక్కకు లాగాడు. పాపులకు తగిన శిక్ష అనుభవించకుండా రావణుడు అలా అడ్డుకోవడంతో యమభటులకు కోపం వచ్చింది. వెంటనే ఆ భటులంతా రావణాసురుడినీ, అతడి సైన్యాన్ని ఎదుర్కొన్నారు. రావణాసురుడు ఎక్కి వచ్చిన పుష్పక విమానాన్ని చుట్టుముట్టి దాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి వేసారు. బ్రహ్మ వరం కారణంగా ఆ పుష్పక విమానం మళ్లీ మాములుగా ప్రత్యక్షమైంది. యమభటులు, రావనసేన ఘోరాతిఘోరంగా యుద్ధం చేయసాగారు. యమభటులు మంత్రులను విడిచిపెట్టి రావణాసురుడిపైకే శూలవర్షాన్ని కురిపించారు. ఆ బాధను తట్టుకోలేక ఆయన కింద పడిపోయారు, కవచం పడిపోయింది, కొద్ది క్షణాలు ఆగి మళ్లీ లేచి పాశుపతాస్త్రాన్ని సంధించాడు. యమభటులు ఒక అడుగు వెనక్కి వేశారు. వెంటనే రావణుడు అతడి మంత్రులు జయజయధ్వానాలు చేశారు, ఆ శబ్దం యమధర్మరాజుకు వినిపించి శత్రువును జయించడానికి తానే స్వయంగా బయలుదేరాడు. ఆయన వెంట మూడు లోకాలను నాశనం చేయగలిగిన శక్తి ఉన్న మృత్యుదేవత బయలుదేరింది. యమధర్మరాజు కాలపాశంతోను, ముద్గురం లాంటి ఆయుధాలతోను రావణుడి మీద అగ్రహించి బయలుదేరాడు. అలా కోపంతో వస్తున్న యమధర్మరాజుని చూసి రావణాసురుడి మంత్రులంతా తలా ఒక దిక్కుకు భయంతో పరుగెత్తారు. యమధర్మరాజు రాకను రావణుడు మాత్రం లెక్కచేయలేదు. అలాగే మొండిగా నిలుచున్నాడు. యముడు మరీ కోపంతో తన దగ్గరున్న శక్తి, తోమరం అనే ఆయుధాలను రావణుడిపైకి విసిరాడు. ఆ ఆయుధాల దెబ్బలు తగిలినా రావణాసురుడు లెక్క చేయకుండా అలాగే నిలబడ్డాడు. ఆ యుద్ధం చూడటానికి దేవతలు, గంధర్వులు, ఋషులు, బ్రహ్మదేవుడు సహా అక్కడికి వచ్చారు. రావణాసురుడు తన విల్లును ఎక్కుపెట్టి మృత్యుదేవత పైకి నాలుగు బాణాలు, యముడి మీదకు అనేకానేక బాణాలను వదిలాడు. అందుకు కోపించిన యముడు ముక్కుపుటలనుంచి గొప్ప అగ్నిజ్వాలలు బయలుదేరాయి. ఆ అగ్ని రావణాసురుడిని దహిస్తుందని మృత్యువు, యముడు అనుకున్నారు. అలా జరగక పోయేసరికి మృత్యువు యముడితో తనను రావణుడి మీదకు వదలాలని, వాడిని నాశనం చేసి వస్తానని పలికింది. యముడు తానే స్వయంగా రావణుడిని సంహరించాలని తన చేతిలో ఉన్న కాలదండాన్ని పైకెత్తాడు, శత్రువు మీదకి దాడి చేయడానికి సిద్ధంగా కాలపాశం, ముద్గరం లాంటి ఆయుధాలు సిద్ధమయ్యాయి.

ఆ తీవ్ర పరిస్థితి చూసి దేవతలంత గజగజ వణికిపోయారు. బ్రహ్మదేవుడు కల్పించుకొని యముడిని వారించాడు. కాలదండం ప్రయోగిస్తే రావణుడు మరణించడం తప్పదని, అలా జరిగితే అతడికి తానిచ్చిన వరం విఫలమైనట్లుగా అవుతుంది కనుక కోపాన్ని ఉపసంహరించుకోవాలని బ్రహ్మదేవుడు యముడికి నచ్చజెప్పాడు. బ్రహ్మ మాటలను గౌరవించి యముడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. రావణాసుర చరితంలోని ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు, ఆ రాక్షసుడు బ్రహ్మ వలన వరం పొంది దేవతలను ఎంతగా ఇబ్బంది పెట్టాడో విశదం అవుతుంది. ఇలాంటి అనేకానేక కారణాలు రామావతారంలో విష్ణువు భూలోకానికి రావడానికి దారితీశాయి. దీని ద్వారా తెలిసిందేమంటే పూర్వ జన్మలో జయవిజయులలో ఒకడైన రావణుడు శ్రీవిష్ణు తో మాత్రమే యుద్ధం చేసి చనిపోయి మూడు జన్మలు ముగించి శ్రీహరి ద్వారపాలకులుగా చేరాలి, దానికి శ్రీహరితో యుద్ధం చేసి మరణాన్ని పొందడమే మార్గం, కాబట్టి బ్రహ్మరాత మన కర్మఫలాన్ని అనుసరించి లెక్కలు వేశాకే రాయబడుతుంది, కాబట్టి బ్రహ్మ తనకు తోచినవిధంగా రాయాటానికి లేదు. కాబట్టే బ్రహ్మ రాసిన రాత తప్పదు అంటారు.

వృద్ధాప్యం.jpg

*మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మాత్రమే అని మనము గ్రహించ గలము...*

*మనము బాల్యం లో ఉన్నప్పుడు, అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు మనతో సన్నిహితముగ ఆడుకున్న వారే.*

*ప్రతిరోజూ, మనము ఒకరిని ఒకరు వెంబడిస్తూ & సందడిగా ఉల్లాసంగా గడిపాము & కలిసి మంచి బాల్యాన్ని గడిపాము.*

*పెద్దయ్యాక, మనము మన స్వంత కుటుంబాలను కలిగిన తరువాత , మన స్వంత ప్రత్యేక జీవితాలను గడుపుతాము & సాధారణంగా అరుదుగా కలుసుకుంటాము. మనందరినీ కనెక్ట్ చేసే ఏకైక లింక్ మన తల్లిదండ్రులు.*

*మనం వృద్ధాప్యం సమీపించే సమయానికి అప్పటికే మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టి వెళ్తారు మరియు మన చుట్టూ ఉన్న బంధువుల సంఖ్య తగ్గిపోతుంది, అప్పుడే మనకు క్రమంగా ఆప్యాయత విలువ తెలుస్తుంది.*

*నేను ఇటీవల ఇంటర్నెట్‌లో ఒక వీడియోను చూశాను, అందులో 101 ఏళ్ల అన్నయ్య తన దూరపు 96 ఏళ్ల చెల్లెల్ని చూడటానికి వెళ్లాడు.* *కొంత సమయం గడిపిన తర్వాత ఇద్దరూ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, చెల్లెలు తన అన్న కారుని వెంబడించి, తన సోదరుడికి 200 యువాన్లు ఇచ్చి, తినడానికి ఏదైనా మంచిది కొనుక్కోమని కోరింది. ఆమె మాటలు చెప్పడం పూర్తికాకముందే ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.*

*ఇంత వృద్ధాప్యంలో కూడా అన్నదమ్ములు మరియు అక్కాచెల్లెళ్లు ఉండటం నిజంగా చాలా అదృష్టమని అనేక నెటిజన్లు వ్యాఖ్యానించారు.*

*అవును, ఈ లోకంలో మనకు రక్తసంబంధం ఉన్న వ్యక్తిని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది.*

*మీరు పెద్దవారైనప్పుడు & మీ తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్లిపోయినప్పుడు, మీ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఈ ప్రపంచంలో మనకు అత్యంత సన్నిహితులవుతారు*

*స్నేహితులు దూరంగా వెళ్లిపోవచ్చు, పిల్లలు పెరిగి ఎగిరి పోవచ్చు కానీ మీ పక్కన మీ జీవితభాగస్వామి తప్ప, మీ జీవితపు చివరి అంకాన్ని పూర్తి చేయడానికి మీ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు మాత్రమే వుంటారు*

*మనము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఒకచోట చేరడం చాలా ఆనందంగా వుంటుంది*

*వారితో కలిసిమేలిసి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా భయపడం. మనము వృద్ధాప్యానికి చేరుకున్న తరుణంలో దయచేసి మీ అన్నదమ్ములు అక్కాచెల్లెల్ల తో కరుణ మరియు దయతో ఉండండి.*

*గతంలో ఏది జరిగినప్పటికీ ఏది ఏమైనఅయినప్పటికీ, అన్నదమ్ములు అక్కాచెల్లెలళ్లు మరింత సహనంతో మరియు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి.*

*అన్నదమ్ముల అక్కాచెల్లెళ్ల మధ్య విడదీయలేని ముడి లేదు. తొలగించలేని కవచం లేదు.*

*ఎప్పుడూ పాత చేదు సంగతులజోలికి వెళ్లకూడదు లేదా పాత పగ ద్వేషం పెట్టుకోకూడదు. ఎక్కువగా పరస్పర ఆధారపడటం & పరస్పర ప్రేమతో, సంబంధాలు మెరుగవుతాయి* *ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు మన అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు*

*సరిఅయిన గ్రహింపు తో సాగిపోదాము... కొన ఊపిరి ఉన్నంతవరకు.......*

avadhanam.jpg

అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటె ప్రశ్నలకి అవధాని అంత కంటే కొంటెగా సమాధానం చెప్తే మంచి హాస్యం పుడుతుంది. అలాంటి కొన్ని ఉదాహరణలు ఎవరో నాకు పంపిస్తే మీతో పంచుకుంటున్నాను .

ప్రశ్న :- అవధానం చేసేవారికి చప్పట్లంటే చాలా ఇష్టమంట కదా! మరి మీకో ?

జవాబు :- నాకు చప్పట్లు ఇష్టం వుండవు. నాకు చప్ప అట్లుకంటే కారం అట్లంటేనే ఇష్టం .

ప్రశ్న :- భార్య తన భర్తకు వడ్డిస్తోంది. భర్త 'పశువ' అన్నాడు. భార్య నవ్వుతూ 'కోతి' అంది ఏమిటిది?

జవాబు :- పశువ అంటే పళ్లెంనిండా శుభ్రంగా వడ్డించమని. కోతి అంటే కోరినంత తిను అని అర్థం .

ప్రశ్న :- పద్యానికి, శ్లోకానికి తేడా ఏమిటి ?

జవాబు :-పద్యం వేగంగా వస్తుంది. శ్లోకం నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే స్లో... కమ్ కదా .

ప్రశ్న:- అమెరికాలో భర్తల సమాధులను భార్యలు విసనకర్రలతో విసురుతారట. చిత్రంగా లేదూ ?

జవాబు:- భర్త చనిపోతూ ‘నా సమాధి ఆరేవరకైనా నువ్వు మరోపెళ్లి చేసుకోవద్దు...' అంటూ ప్రమాణం చేయించుకుంటాడు. భర్త సమాధి తొందరగా ఆరాలని భార్యలు అలా విసురుతూ వుంటారు.

ప్రశ్న : పెళ్లి కాకముందు వధువు, పెళ్లి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుంది.

జవాబు : – పెళ్లి కాకముందు 'అయస్కాంతంలా', 'పెళ్లి అయ్యాక సూర్యకాంతంలా...’

ప్రశ్న :- ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకు రమ్మన్నారు

జవాబు :-ఇంతకీ ఏ కవి 'తలను' తీసికెళ్తున్నారు

ప్రశ్న :- పెళ్లికి వెళ్లుతూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్లటమంటే ఏమిటి ?

జవాబు :- అవధానానికి వెళ్లుతూ అప్రస్తుత ప్రసంగిని వెంట పెట్టుకొని వెళ్లటం .

ప్రశ్న :- అవధానాలను నిషేధించే పని మీకు అప్పజెప్పితే ఏం చేస్తారు?

జవాబు :- దశల వారిగా చేస్తాను. ముందు అప్రస్తుత ప్రసంగాన్ని నిషేధిస్తాను .

ప్రశ్న :- అవధానికి ఆశువులు ఎప్పుడొస్తాయి, ఆశ్రువులు ఎప్పుడొస్తాయి ?

జవాబు :- ప్రశ్న వేస్తే ఆశువులు వస్తాయి. అవధానం జరిగి సత్కారం ఎగరగొడితే ఆశ్రువులు వస్తాయి .

ప్రశ్న :- బోడిగుండుకు, మోకాలికి ముడిపెడతారెందుకు

జవాబు :- రెండింటి మీద అంతగా వెంట్రుకలు వుండవు కాబట్టి .

ప్రశ్న :- మీకు రంభనిస్తే ఏం చేస్తారు?

జవాబు :- ఆనందంగా ఇంటికి తీసికెళ్లి ఆకలి తీర్చుకుంటాను. రంభ అంటే అరటిపండు అని అర్థం .

ప్రశ్న :-నాకీ మధ్య శ్రీకృష్ణుడిపై భక్తి పెరిగిపోతోంది. ఆయనలాగే ప్రవర్తించమంటారా ?

జవాబు :- మీ ఆవిడకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి.

ప్రశ్న :- మీ మైకులో బాంబు పెడితే ఏం చేస్తారు

జవాబు :- వెంటనే ఆ మైకు అప్రస్తుత ప్రసంగీకుడికి ఇచ్చి మాట్లాడమమటాను.

ప్రశ్న :- మీరెప్పుడైనా బూతు పనులు చేశారా జవాబు : -ప్రభుత్వ ఉద్యోగిని కదా ఎన్నికల్లో పోలింగ్ బూతు పనులు' తప్పవు .

ప్రశ్న :- అవధాని గారు మీది వర్ణాంతర వివాహమట నిజమా?

జవాబు :- నిజమే నేను నల్లగా వుంటాను, మా ఆవిడ తెల్లగా వుంటుంది .

ప్రశ్న :-పావురం అంటే మీకు ఇష్టమా ?

జవాబు :-పావు ‘రమ్’ ఎవరికి ఇష్టం వుండదు .

ప్రశ్న :-మీరు సారా త్రాగుతారా ?

జవాబు :- అవును అవధాన కవితామృతాన్ని మన 'సారా’ త్రాగుతాను .

ప్రశ్న :- సన్యాసికి, సన్నాసికి తేడా ఏమిటి?

జవాబు :- అందర్ని వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్నాసి .

ప్రశ్న :- మీకు వాణిశ్రీ అంటే ఇష్టమా ?

జవాబు :- చాలా ఇష్టం. వాణి అంటే సరస్వతి -జ్ఞానం, శ్రీ అంటే సంపద.

ప్రశ్న: – రైలు పట్టాలకు, కాలి పట్టీలకు అనుబంధం ఏమిటి?

జవాబు:- రైలు, పట్టాల మీద వుంటుంది. పట్టీలు, కాలి మీద వుంటాయి .

ప్రశ్న:- సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేమి చేస్తారు ?

జవాబు:- పాలిచ్చేవైతే యింటికి తోలుకెళ్తా .

ప్రశ్న:- పురుషులందు పుణ్యపురుషులు వేరయా! అన్నాడు వేమన. మరి మీరేమంటారు?

జవాబు:- పురుషులందు పుణ్యపురుషులు 'ఏరయా!’

ప్రశ్న:- అవధానిగారు ఇక్కడికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వస్తే మీరేం చేస్తారు?

జవాబు:- మరో నలుగుర్ని పిలిచి 'అష్టావధానం' చేస్తాను.

ప్రశ్న:- పెళ్లయిన మగవారిని ఏమీ అనరు. కానీ పెళ్లయిన ఆడవాళ్లను 'శ్రీమతి' అంటారెందుకు?

జవాబు:- పెళ్లయిన తరువాత 'స్త్రీ మతి' స్థితిమతి.

మీదే పురుషులు ఆధారపడుతారు గనుక .

ప్రశ్న:- ప్రేమికుడికి, భర్తకు ఏమిటి తేడా గురువు గారు

జవాబు:- గొడవపడితే మాట్లడదేమోనని

భయపడేవాడు ప్రేమికుడ ... మాట్లాడితే గొడవ పడుతుందేమోనని భయపడేవాడు భర్త

ప్రశ్న:- అవధానిగారు కీర్తిశేషుల పెండ్లిపత్రిక వచ్చింది. పెళ్లికి వెళ్లమంటారా?

జవాబు:- తప్పకుండా వెళ్లు. కీర్తిశేషులంటే ' కీర్తి' అమ్మాయి పేరు, 'శేషు' అబ్బాయి పేరు .

ప్రశ్న:- గురువుగారు మా మొదటి అమ్మాయి పేరు దీపిక, రెండవ అమ్మాయి పేరి గోపిక. మరి మూడో అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి?

జవాబు: - ‘ఆపిక’ వెంటనే అవధాని సమాధానం

----------శుభోదయం----------సుభాషితాలు--------------

కమలలోచన! నన్ను గన్న తండ్రివి గాన నిన్ను నేమరకుంటి నేను విడక

యుదరపోషణకునై యొకరి నే నాశింపనేర నాకన్నంబు నీవు నడుపు

పెట్టలేనంటివా పిన్న పెద్దలలోన దగవు కిప్పుడు దీయదలచినాను

ధనము, భారంబైన దల కిరీటము నమ్ము కుండలంబులు పైడి గొలుసులమ్ము

కొసకు నీ శంఖ చక్రముల్ కుదువబెట్టి గ్రాసము నొసంగి పోషించు కపటముడిగి

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భవదీయాదరలీల లోకముల నుత్పాదించి రక్షింప నేఁ

డవి దైత్యేశునిచేత భేదితములై హ్రస్వంబులై యుండ నీ

యవినీతున్ నరసింహరూపమున సంహారంబు నొందించి వే

దవిధిం గ్రమ్మఱ నుద్ధరించితి గదా ధర్మానుసంధాయివై.”

భావము:- “ఓ ధర్మసంస్థాపకా! ధర్మమూర్తీ! నీవు ఎంతో ఆదరంతో లోకాలను సృష్టించి, రక్షిస్తున్నావు. కానీ ఇవాళ రాక్షసుడు హిరణ్యకశిపుడు లోకలను ఛిన్నా భిన్నం చేసాడు. ఈ దురహంకారిని నరకేసరిగా అవతరించి, సంహరించావు. వేద ధర్మాన్ని మరల ఉద్ధరించావు.”

శుష్క వైరం న కుర్వీత

గోశృంగ స్యేవ భక్షణం

దన్తాశ్చ పరిమృజ్యన్తే

రసస్యాపి న లభ్యతే

భావము:-- అనవసరంగా ఎవరితోనూ తీవ్రమైన శత్రుత్వం పెట్టుకోరాదు. అది ఆవుకొమ్ము

తినే ప్రయత్నము చేసినట్టు. దానివల్ల పళ్ళు నొప్పి పుడతాయికానీ రసము లభించదు.

అనగా నిష్కారణ శత్రుత్వం అనర్థదాయకమని భావము.

గతిర్భర్తా ప్రభుస్సాక్షీ

నివాసశ్శరణం సుహృత్ |

ప్రభవః ప్రలయః స్థానం

నిధానం బీజమవ్యయమ్ ||

తా:- పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును,నాశరహితమైన బీజమును (మూలకారణమును) నేనే అయియున్నాను.

శ్లో|| యావత్స్వస్థో హ్యయం దేహో

యావన్మృత్యుశ్చ దూరతః

తావదాత్మహితం కుర్యాత్

ప్రాణాంతే కిం కరిష్యతి!!

చాణక్య నీతి

తా|| ఆరోగ్యము అందుబాటులో ఉన్నపుడే, మృత్యువు దూరముగా ఉన్నపుడే (అంటే నీవు యవ్వనములో ఉన్నపుడే) ఆత్మానువర్తివై నడచుకోగలిగితే మంచిది.... నీవు కళ్ళు తెరిచే లోపే ముసలితనము ముంచుకొచ్చేస్తుంది, మృత్యువు కబళించేస్తుంది... తస్మాత్ జాగ్రత్త జాగ్రత......

తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ |

అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ||

తా:- ఓ అర్జునా! నేను (సూర్యకిరణములచే) తపింపజేయుచున్నాను మఱియు వర్షమును కురిపించుచున్నాను. వర్షమును నిలుపదల చేయుచున్నాను. మరణరాహిత్యమున్ను (మోక్షమున్ను), మరణమున్ను నేనే. అట్లే సద్వస్తువున్ను, అసద్వస్తువున్ను నేనే (అయియున్నాను).

గతిర్భర్తా ప్రభుస్సాక్షీ

నివాసశ్శరణం సుహృత్ |

ప్రభవః ప్రలయః స్థానం

నిధానం బీజమవ్యయమ్ ||

తా:- పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును,నాశరహితమైన బీజమును (మూలకారణమును) నేనే అయియున్నాను.

దుర్లభం త్రయ మేవైతత్ దైవానుగ్రహ హేతుకం

మనుష్యత్వం, ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః

తా:--మనుష్యజన్మ, ముముక్షుత్వం, సత్పురుషుల యొక్క సహవాసం;

ఈమూడున్నూ బహు దుర్లభములు. కేవలం ఈశ్వరానుగ్రహం వల్లనే ఎవరికైనా

లభిస్తాయి.

లౌకికాననామ్ హి సాధూనాం అర్థం వాగనువర్తతే

ఋషీణాం పునరాద్యానాం వాచమర్థో. నుధావతి

తా:-- సాధుపురుషుల యొక్క వాక్కుఉద్దిష్టమైన అర్థమును అనుసరిస్తుంది.మరేమో

ఆద్యులైన మహర్షుల వాకునే అనుసరిస్తుంది.మహర్షులన్న మాటలు జరిగి

తీరుతుందని అర్థము.

కులము హెచ్చు తగ్గు గొడవలు పనిలేదు

సానుజాతమయ్యె సకల కులము

హెచ్చు తగ్గు మాట లెట్లెరుంగగవచ్చు

విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఏ కులం గొప్పదని, ఏ కులం తక్కువ అని గొడవలు అనవసరం. ఒకే కూటమి నుండి ఒకదాని తర్వాత మరొకటిగా ఈ కులాలు ఏర్పడ్డాయి.అందువల్ల ఏది గొప్పది అని తెలుసుకోవడం వీలుకాదు

గంధపు చెట్టుక్రింద నురగంబు పయోనిధి బడబాగ్ని, మా /

కందఫలంబు క్రింద నొక కందురు దుంప, జగద్విలోక నా/

నందము మేఘమందు బవి నాచిన మాడ్కిన కారణంబుగా/

నుందురు దాత సన్నిధి నయోగ్యులు కొందఱు మల్లికార్జునా!

మంచి గందపు చెట్టు కింద పాము,సముద్రం లో బడబాగ్ని'మామిడి పండు కింద తేనే

తుట్ట, లోకమునకు ఆనందము కలిగించు మేఘములో పిడుగు , ఆయా వస్తువులను

సులభముగా అందకుండా చేస్తాయి. అలాగే.దాత చెంతకు కవులను,భిక్షుకులను

చేరనీయకుండా కొంతమంది దుష్టులు అడ్డుపడుతుంటారు.

bottom of page